![]() |
![]() |

స్టార్ మా సీరియల్స్ లో అత్యధిక టీఆర్పీతో దూసుకెళ్తున్న సీరియల్ " గుప్పెడంత మనసు". ఈ సీరియల్ లో రిషి, వసుధారల ప్రేమకథకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే రిషికి అమ్మ పాత్రలో చేసిన జగతిని.. కొన్ని రోజుల క్రితం చనిపోయిందంటూ ముగింపు చెప్పారు. ఇక ఇప్పుడు ఈ సీరియల్ లో రిషి కనపడుట లేదు. గత వారం నుండి రిషి లేకుండానే ఈ సీరియల్ ని కొనసాగిస్తున్నారు మేకర్స్.
అసలు రిషి ఎక్కడ? అతనికి ఏం అయిందంటూ ఈ సీరియల్ అభిమాలు తెగ కామెంట్లు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ సీరియల్ లో శైలేంద్ర మీద ఎటాక్ జరిగింది. అది తెలిసి అందరు తన దగ్గరికి వెళ్తుండగా.. మళ్ళీ వస్తానని వసుధారకి చెప్పి బయటకు ఎక్కడికో వెళ్తాడు. ఇక అలా వెళ్ళిన రిషి ఆ తర్వాత ఏ ఎపిసోడ్ లో కనపడలేదు. అయితే ప్రస్తుతం రిషి ఎక్కడా అంటే శైలేంద్ర కిడ్నాప్ చేసినట్టుగా వసుధారని బ్లాక్ మెయిల్ చేసి ఎండీగా భాద్యతల నుండి తప్పుకోమని చెప్పాడు. మరి రిషి నిజంగానే ఉన్నాడా లేక వెళ్ళిపోయాడా.. అసలు ఈ సీరియల్ లో మళ్ళీ కన్పిస్తాడా? లేదా? అంటూ ప్రేక్షకులు తెగ ప్రశ్నలు కురిపిస్తున్నారు. అయితే ఈ సీరియల్ లో రిషికి నాన్న పాత్రలో చేస్తున్న మహేంద్ర అలియాస్ సాయికిరణ్ ఈ విషయాల గురించి ప్రేక్షకులకు శుభవార్త చెప్పాడు.
మహేంద్ర తన ఇన్ స్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేశాడు. అందులో ఏం చెప్పాడంటే.. జిమ్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా రిషి(ముఖేష్) గాయపడ్డాడని, ఆ గాయం కాస్తా ఎక్కువ ఉండటంతో ఎంఆర్‌ఐ స్కాన్ చేసారంట. దాని తర్వాత డాక్టర్స్ బెడ్ రెస్ట్ కావాలని చెప్పారంట. దాంతో రిషి అలియాస్ ముఖేష్ గౌడ షూటింగ్‌కి కొన్నిరోజులు దూరం కావాల్సి వచ్చింది. అంటే రిషి కావాలని గ్యాప్ ఇవ్వలేదు గాయం వల్ల ఆ గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే గత కొన్ని వారాలుగా 'గుప్పెడంత మనసు' సీరియల్‌లో హీరో పాత్ర కనిపించడం లేదు. దాదాపు మూడు వారాలుగా గుప్పెడంత మనసు సీరియల్ లో హీరో రిషి లేకుండానే కథను లాక్కొస్తున్నారు. దీంతో ఆయనకి ఏమైందనే రకరకాల ఊహాగానాలకు తెరదించుతూ.. రిషి ఫ్యాన్స్‌కి గుప్పెడంత మనసు సీరియల్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు సాయి కిరణ్ అలియాస్ మహేంద్ర భూషన్. కాగా మరికొన్ని రోజుల్లో రిషి కమ్ బ్యాక్ ఉంటుందని అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.
![]() |
![]() |